ముగించు

మద్య నిషేదం మరియు అబ్కారి

ఎక్సైజ్

పరిచయం:

ప్రజల జీవన క్రమాన్ని సక్రమంగా కొనసాగించడం మరియు రాష్ట్ర ఆదాయం పెంపొందించడం అను రెండు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో రూపొందించబడినది ఈ శాఖ. పొరుగు రాష్ట్రాలు వారి నిషేధం విధానాలను సడలించిన పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా మొత్తం నిషేధాన్ని అమలుచేసే విధానం సాధ్యం కాలేదు. అందువల్ల, రిటైల్ విక్రయ దుకాణాలలో విదేశీ మద్యం తరహాలో దేశీయ మద్యం విక్రయించే విధానం రాష్ట్రంలో ఆచరించబడుతోంది. మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రెవెన్యూ సంపాదన శాఖ.
ఎక్సైజ్ విభాగం సుంకాలు ద్వారా ఆదాయాన్ని సేకరించడమే కాక నకిలీ మద్యం నియంత్రించడంలో కుడా ప్రధాన భూమిక వహిస్తుంది. ఈ శాఖ లో ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పనిచేసే చేసే సిబ్బంది ఉన్నారు. ఈ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం వివిధ చట్టాలు మరియు నియమాలు అక్రమ రవాణా చేయకుండా, సారాను నియంత్రించడంలో, విదేశీ మద్యంను గుర్తించడంలో మరియు ఎక్సైజ్ రెవెన్యూ యొక్క ఎగవేత నివారించడం లో కీలక పాత్రను పోషిస్తుంది.

శాఖా స్వరూపం – కార్యకలాపాలు

రాష్ట్ర ఎక్సైజ్ డిపార్టుమెంటు ఎక్సైజ్ కమీషనర్ నేతృత్వంలో, హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర ముఖ్యమైన విషయాలతో వ్యవహరిస్తున్న ఒక సహాయ కమిషనర్ సహాయం చేస్తాడు. ప్రధాన కార్యాలయాలలో ఉన్న ఇద్దరు సంయుక్త కమీషనర్లు డిస్టిలరీ, బ్రూవరీస్ మరియు ఆడిట్లకు సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ కు సహాయం చేస్తారు. ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్, రాష్ట్ర ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం రాష్ట్రం అమలులో ఎక్సైజ్ కమిషనర్ కు సహాయపడతారు .
కమిషనర్ గారి ఆదేశాలమేరకు డిప్యుటి కమిషనర్ వారు మద్యం అమ్మకాలు మరియు సరఫరా, డిపో అద్దెల సేకరణ మరియు IML మద్యం షాపులకు లైసెన్సుల మంజూరు, ఎక్సైజ్ విధులు మరియు ఫీజు అలాగే అమలు కార్యకలాపాలు ఎక్సైజ్ సూపరింటెండెంట్/ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ / ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అధికారులు మరియు ఇతర సిబ్బంది సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. కెమికల్ ఎగ్జామినర్స్ నేతృత్వంలోని ప్రాంతీయ రసాయన ప్రయోగశాల లో అన్ని రకాల మద్యాల నమూనాలను పరిశీలిస్తుంది కల్తీశాతాన్ని ధ్రువీకరిస్తుంది, ఆయా పదార్తాలను నిర్ధారిస్తుంది.

కర్నూలు జిల్లా ఆర్గానోగ్రామ్:

ఎక్సైజ్ ఆర్గానోగ్రామ్

కర్నూలు జిల్లా పరిధి లో ఎక్సైజ్ శాఖ :

కర్నూలు రెవెన్యూ జిల్లాను కర్నూలు మరియు నంద్యాల అను రెండు ఎక్సైజ్ ప్రాదేశిక మద్యనిషేదము మరియు అబ్కారి పర్యవేక్షక జిల్లాలు గా విభజించడమైనది.ప్రతి జిల్లాకు మద్యనిషేదము మరియు అబ్కారి పర్యవేక్షక అధికారి నేతృత్వం వహిస్తు వారికి సహాయక మద్యనిషేదము మరియు అబ్కారి పర్యవేక్షక అధికారి సహకరిస్తారు. కర్నూలు మద్యనిషేదము మరియు అబ్కారి పర్యవేక్షక జిల్లా మొత్తం (8) ఎక్సైజ్ స్టేషన్స్ ను కలిగి ఉన్నది, అవి 1) కర్నూలు, 2) కోడుమురు, 3) నందికోట్కూరు, 4) ఆదోని, 5) ఆలూరు, 6) ఎమ్మిగనూరు, 7) కోసిగి , 8) పత్తికొండ మరియు నంద్యాల మద్యనిషేదము మరియు అబ్కారి పర్యవేక్షక జిల్లా మొత్తం (6) ఎక్సైజ్ స్టేషన్స్ ను కలిగి ఉన్నది, అవి 1) నంద్యాల, 2) ఆళ్ళగడ్డ, 3) కోయిలకుంట్ల, 4) బనగనపల్లి, 5) డోను మరియు 6) ఆత్మకూరు.

ఎక్సైజ్ మ్యాప్ కర్నూలు

కర్నూలు జిల్లాలోని ఎక్సైజ్ శాక పరిపాలన:

EXCISE ADMINISTRATION in KURNOOL DISTRICT:
S.NO. Name of the Excise District Name of the Station Name of the Mandal
(1) (2) (3) (4)
(1) KURNOOL Kurnool Kurnool, Kallur,Orvakal
Kodumur Kodumur, Goudur, C.Belagal
Nandikotkur Nandikotkur,Midthur, Pagidyala,Jupadu Banglow
Adoni Adoni Municipality,Kowthalam
Kosigi Kosigi, Peddakadabur
Yemmiganur Yemmiganur including Municipality, Nandavaram, Mantralayam
Alur Alur, Chippagiri, Holagunda, Halaharvi, Aspari
Pathikonda Pathikonda, Devanakonda, Gonegandla, Maddikera, Tuggali
(2) NANDYAL Nandyal Nandyal, B. Atmakur, Thimmapuram / Mahanandi, Panyam, Gadivemula
Allagadda Allagadda, Chagalamarri, Sirivella,  Gospadu, Rudravaram
Koilkuntla Koilkuntla, Dornipadu, Uyyalawada , Kolimigundla, Sanjamala
Banaganapalli Banaganapalli, Owk
Atmakur Atmakur, Velugodu, Kothapalli, Pamulapadu, Sunnipenta
Dhone Dhone, Krishna Giri, Veldurthy, Bethamcherla, Peapully

సరహద్దు చేక్ పోస్ట్ లు:

కర్నూలు జిల్లాలో (9) బార్డర్ చెక్ పోస్ట్ లు కలవు.

కర్నూలు ఎక్సైజ్ జిల్లాకు సంభందించిన చెక్ పోస్ట్ లను ఈ క్రింద పొందు పరచాదమైనది:
Sl.No. Name of the Border Check Post Name of the Station limits in which Check Post is situated Places connected by the routes through the check post
1 Chatragudi Alur Ballary – Alur
2 Holagunda Alur Siriguppa – Alur
3 Peddaharivanam Adoni Siriguppa – Adoni
4 Bapuram Adoni Hacholi – Adoni
5 Madhavaram Yemmiganur Rayachur – Adoni
6 Naguladinne Yemmiganur Gadwal – Yemmiganur
7 Thungabadgra(ICP) Kurnool As per G.O. Rt.No. 677 Revenue (Ex-II)Dept. dt:2.6.2014 were sanctioned for bordering Dist. of Telangana.
8 Sunkesula Kurnool
నంద్యాల ఎక్సైజ్ జిల్లాకు సంభందించిన చెక్ పోస్ట్ లను ఈ క్రింద పొందు పరచాదమైనది:
Sl.No. Name of the Border Check Post Name of the Station limits in which Check Post is situated Placeses connected by the routes through the check post
1 Ligalagattu Atmakur Srisailam – Mahaboob Nagar Dist
మొబైల్ బార్డర్ పెట్రోలింగ్ పార్టి :
Sl.No. Name of the Mobile party Places covered
1) Yemmiganur 11 Mandals, Viz : Yemmiganur, Mantralayam,Nandavaram, Kosigi, Kowthalam, Adoni, Alur, Holagunda, Chippagiri and Halaharvi.

 

DISTILLERIES & IML ADMINISTRATION IN KURNOOL DISTRICT:

ఇండియన్ మేడ్ ఫారిన్ తయారీలో స్పిరిట్ ను ముడి పదార్థంగా ఉపయోగిస్తారు

విద్యా సంస్థలు, ప్రయోగశాలలు మరియు పరిశోధన సంస్థలు కూడా చిన్న పరిమాణంలో స్పిరిట్ ను  ఉపయోగిస్తారు.

INDIAN MADE FOREIGN SPIRITS AND BEER UNITS

  1. There are 206 A4 shops & 46 2B Bars are in Kurnool Revenue District.
  2. P.Tourism(TD1)
  3. Kurnool Club (C1)
  4. Military Cantin, B- Camp, Kurnool.
  • M/s. SPY Agros, Udumalpuram (V), Nandyal (M):
కర్నూలు జిల్లాలోని ఉడుములాపురం (గ్రా ) వద్ద ఉన్న డిస్టిలరీ లైసెన్స్ నెం .26, తేది: 26-12-2007 spirit (మొక్కజొన్న, బ్రోకెన్ రైస్, జవర్) ఉత్పాదక కేంద్రం.  డిస్టిలరీ యొక్క వార్షిక ఉత్పాదక సామర్ధ్యం 10,00,00,000 pls. 2018-19 సంవత్సరానికి 10 కోట్లు   చెల్లించి  D2 (RG) లైసెన్స్ పునరుద్ధరించబడింది.

List of Mathonol Units in Kurnool District:-

  1. SRHH, Gondiparla (V), Kurnool (M)
  2. SRAAC Ltd, Gondiparla (V), Kurnool (M)
  3. Hepta Chem Pvt. Ltd., Adoni.
  4. Star Neo Chem Pvt. Ltd., Adoni.

 

పథకాలు /చేపట్టిన చర్యలు :

    1. HPFS
    2. బెల్ట్ షాపుల నిర్మూలన
    3. నవోదయం /జాగృతి
  • HPFS: (HEDONIC PATH FINDING SYSTEM)

మా శాఖ కమిషనర్ గారు 2013 న Karvy డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సమర్పణలో ట్రాక్ మరియు ట్రేస్ HPFS IT సాధన మార్గాన్ని ద్గ్విజయంగా ప్రవేశపెట్టింది . HPFS పరిచయం వెనుక ప్రధాన లక్ష్యం అన్ని స్థాయిలలో జవాబుదారీతనం & పారదర్శకత సాధించడం అంటే,  మద్యం తయారీ యూనిట్ నుండి డిపో వరకు మరియు డిపో నుండి రిటైలర్ వరకు (A4 & 2B). కఠినమైన MRP ధరలను అమలు చేయడం కోసం కర్నూలు రెవెన్యూ జిల్లాలోని అన్ని A4 దుకాణాలు (వైన్ దుకాణాలు) మరియు బార్ల లో  HPFS సిస్టమ్స్ విజయవంతంగా నడుపుతున్నారు.

  • బెల్ట్ షాపుల నిర్మూలన

మన ప్రభుత్వం బెల్ట్ షాపుల నిర్మూలనకై G.O.Ms.No.263 (Rev.Ex(II)) Dept, Dated:8.6.2014 ను జారీచేసింది. బెల్ట్ షాపుల నిర్ములనపై ప్రజలకు అవగాహన కల్పించటానికి గ్రామసభలు, మండల సభలు చేపడుతున్నాము. అనుమాన ప్రదేశాలలో మా శాఖ సిబంది దాడులు జరిపి తగుచర్యలు తీసుకొంటున్నారు.  పై అధికారుల ఆదేశాల మేరకు (54) మండల సభలు మరియు (876) గ్రామసభలు.

  • నవోదయం /జాగృతి

04-02-2016 న, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, కర్నూలు వారు నవోదయం  కార్యక్రమాన్ని  సారా రహిత కర్నూలు జిల్లా ముఖ్య ఉద్దేశంగా  ప్రారంభించారు మరియు సారా నిర్మూలన సమన్వయ కమిటీలు గ్రామాలు, మండల్, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం యొక్క ప్రణాళిక ప్రకారం నవోదయం ప్రక్రియలో వివిధ చర్యలు చేపడుతున్నాము.

మద్య నిషేధం మరియు అబ్కారి శాఖ లో కంప్యూటర్ ప్రాధాన్యత

  • e-Office విధానం :

ఈ డిపార్ట్మెంట్లో ఇ-కార్యాలయం నాలుగు యూనిట్లలో అనగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, కర్నూల్, నంద్యల్, అసిస్టెంట్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల లో విజయవంతంగా అమలు చేయబడుతోంది. జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ సూచనల ప్రకారం మా శాఖ యొక్క పరిపాలన నాణ్యతను పెంపొందించుకోవడమే కాక, పరివర్తన, జవాబుదారీతనాన్ని పెంచుకోవడం ఇ-కార్యాలయం విధానం ద్వారా సాధ్యపడుతుంది  .

  • Bio-metric Attendance (BAS) విధానం :

జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారం మద్య నిషేధం మరియు అబ్కారి శాఖ లో బయో-మెట్రిక్ హాజరు వ్యవస్థ విజయవంతంగా జూలై 2017 నుంచి నాలుగు యూనిట్లు మరియు 14 స్టేషన్ల లో అమలు చేస్తున్నాము. 325 మంది ఉద్యోగులు మా డిపార్ట్మెంట్ కింద నమోదు చేశారు.

  • CFMS:

APCFSS బృందం మే నెలలో రూపొందించిన CFMS 2018 విధానం ద్వారా ఈ డిపార్ట్మెంట్ లో వేతన బిల్లుల ను విజయవంతంగా అమలు చెయడమైనది. ప్రతి నెల  CFMS ద్వారా కంటిజెంట్  బిల్లులను మ్యాపింగ్ చేయడం ద్వారా సంబంధిత DDO లు ట్రేసరి కి పంపడమైనది.

  • స్పందన   వెబ్సైట్ పర్యవేక్షణ:

ఈ విభాగానికి కేటాయించిన 3 లగిన్లు 1) dc_exise_knl, 2) se_excise_knl, 3) se_excise_nandyal. CM ప్రజా దర్బార్, స్పందన, CMO కాల్ సెంటర్, AMS గ్అర్జీలు e.t.c వంటి అన్ని రకాల ఫిర్యాదులను పర్యవేక్షించడం మరియు పిటిషన్స్ పై వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది .

  • ECMS (Excise Complaint Management System):

మా డిపార్టుమెంటు, 2019 లో ప్రజల నుండి మద్యం అక్రమ అమ్మకాలు/సారా తయారి పై కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించిన అన్ని రకాల కంప్లైంట్స్ ను Excise Complaint Management system ద్వారా సంబదిత అధికారి లాగిన్ కి త్వరితగతిన చేరవేసి ఆ కంప్లైంట్ పై తక్షణమే చర్య తిసుకోనబడుతుంది.

ఈ వెబ్సైటు ద్వారా సమస్యలు పరిష్కరించు విధానం ఈ క్రింది రేఖాచిత్రమున పొందుపరచడ  మైనది.

కమాండ్ కంట్రోల్ రూమ్

ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్ లు :
అధికారి పేరు మొబైల్ నంబరు
డిప్యూటి కమిషనర్ 9440902236
అసిస్టెంట్ కమిషనర్ 9440902268
ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు 9440902572
ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల 9440902582

 

కంట్రోల్ రూమ్  నెంబర్ లు
కార్యాలయం పేరు ఫోను నంబరు
డిప్యూటి కమిషనర్ కార్యాలయము 08518-221812
అసిస్టెంట్ కమిషనర్   కార్యాలయము 08518-249294
ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు కార్యాలయము 08518-220779
ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల కార్యాలయము 08514-226888
ఎక్సైజ్ శాఖ ప్రధాన లక్ష్యం అక్రమ స్వేదనం, అక్రమ ప్రయోజనాల కోసం స్పిరిట్ మళ్లింపు మరియు నకిలీ / సెకండ్ల మద్యం యొక్క రవాణాను అరికట్టడం . ఈ శాఖ చేపట్టే చర్యలు కల్తి మద్యం త్రాగి జీవితాలను కోల్పోతున్న వారి జివితాల లో  విషాదాన్ని నివారించడానికి మరియు ప్రభుత్వ యొక్క ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది .
జి. చెన్నకేశవ రావు
మద్యనిషేదము మరియు అబ్కారి ఉపకమిషనర్  కర్నూలు